Back

అన్నమయ్య కీర్తన కంటి నఖిలాండ

కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి |
కంటి నఘ్ములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

మహనీయ ఘ్న ఫణామణుల శైలము గంటి |
బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి |
రహి వహించిన గోపురములవె కంటి ||

పావనంబైన పాపవినాశము గంటి |
కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి |
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||

పరమ యోగీంద్రులకు భావగోచరమైన |
సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి |
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||

PDF, Full Site (with more options)