Back

అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి

రాగం: లలిత

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి |
ప్రియురాలవై హరికి~ం బెరసితివమ్మా ||

పాలజలనిధిలోని పసనైనమీ~ంగడ
మేలిమితామరలోని మించువాసన |
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ||

చందురుతోడ~ం బుట్టిన సంపదలంఎఱు~ంగవో
కందువ బ్రహ్మల~ం గాచేకల్పవల్లి |
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మా^^ఇంటనే వుండవమ్మా ||

పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురు~ంబోడి |
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ||

PDF, Full Site (with more options)