Back

అన్నమయ్య కీర్తన జగడపు చనువుల

జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ||

ంఒల్లలు తురుముల ముడిచిన బరువున
ంఒల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||

బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ||

PDF, Full Site (with more options)