Back

అన్నమయ్య కీర్తన గోవిందాశ్రిత గోకులబృందా

గోవిందాశ్రిత గోకులబృందా |
పావన జయజయ పరమానంద ||

జగదభిరామ సహస్రనామ |
సుగుణధామ సంస్తుతనామ |
గగనశ్యామ ఘ్నరిపు భీమ |
అగణిత రఘ్వంశాంబుధి సోమ ||

జననుత చరణా శరణ్యు శరణా |
దనుజ హరణ లలిత స్వరణా |
అనఘ్ చరణాయత భూభరణా |
దినకర సన్నిభ దివ్యాభరణా ||

గరుడ తురంగా కారోత్తుంగా |
శరధి భంగా ఫణి శయనాంగా |
కరుణాపాంగా కమల సంగా |
వర శ్రీ వేంకట గిరిపతి రంగా ||

PDF, Full Site (with more options)