Back

అన్నమయ్య కీర్తన అలరులు కురియగ

రాగం: ధీర శంకరాభరణం

అలరులు గురియగ నాడెనదే |
అలకల గులుకుల నలమేలుమంగ ||

అరవిరి సొబగుల నతివలు ంఎచ్చగ
అర తెర మరుగున నాడె నదే |
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ ||

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే |
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ||

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే |
కందువ తిరువెంకటపతి ంఎచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ ||

PDF, Full Site (with more options)